Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీ షోలు, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9.35 కోట్ల రూపాయల మేర ఆస్తులు, నగదు కాజేసినట్లు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
లండన్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి అతనికి దగ్గరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులకే వీరి పరిచయం ప్రేమగా మారడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాధితుడు ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపినట్లు తెలిపారు. బాధితుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం,
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
2018 నుంచి 2025 వరకు అషు రెడ్డి వివిధ రూపాల్లో దాదాపు 9 కోట్లు పైమాటే తీసుకున్నట్లుగా తెలిపారు. అలాగే 5 కిలోల బంగారంతో పాటుగా.. ధర్మేంద్ర పంపిన డబ్బుతో కారు, ఫ్లాట్లు కొనుగోలు చేసి తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట అషు. అలా అన్నీ కలిపి రూ. 9.35 కోట్ల మేర ఉంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనంగా ఆమె సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో ఉంది. బాధిత కుటుంబం పెళ్లి గురించి ఒత్తిడి చేయగా అషు నిరాకరించడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అషు రెడ్డి బ్యాంక్ ఖాతాలు, గత ఏడేళ్ల కాలంలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది.
గతంలో డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్ట్ వ్యవహారంలో అషు రెడ్డి పేరు వినపడగా, ఆ తర్వాత ఆమె తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాజాగా ఈ ‘లవ్ అండ్ మనీ’ స్కామ్ ఆమె కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అషు, ఈ తాజా కేసుపై ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!