Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahendragiri Varahi: అక్కినేని కంపౌండ్ నుంచి సుమంత్ హీరోగా, ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న సరికొత్త మూవీ ‘మహేంద్రగిరి వరాహి’. భక్తి, సైన్స్, మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ అఫీషియల్ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ రోజు ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన గ్రాండ్ ప్రెస్మీట్లో నిర్మాత మధు కలిపు వెల్లడించిన వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా సినిమాలో ఓ స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల పాటు సర్ప్రైజ్ రోల్లో కనిపించనున్నారన్న ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం గోప్యంగా ఉంచడం అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
ప్రెస్మీట్లో మాట్లాడిన నిర్మాత మధు కలిపు, ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. టీజర్ విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యూస్ సాధించడం మాత్రమే కాకుండా, సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా వేగంగా పూర్తైందని వెల్లడించారు. ఇది సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మూవీలో భక్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు నిర్మాత వివరించారు. వారాహి అమ్మవారిపై రూపొందించిన రెండు పాటలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని కూడా చెప్పారు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి పాటలకు ఉన్న ఆదరణ తరహాలోనే, రాబోయే రోజుల్లో ఈ వారాహి అమ్మవారి పాటలు కూడా భక్తుల నోట నానుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ యాక్టర్ మంజు భార్గవి మాట్లాడుతూ.. ఎన్ని దేవుళ్ళ సినిమాలు వచ్చినా సరే మా ‘మహేంద్రగిరి వారాహి’ మూవీకి రిలీజ్ తరువాత ఒక ప్రత్యేక గుర్తింపు కచ్చితంగా వస్తుందని చెప్పారు. డైరెక్టర్ కాలుకు గాయం అయినా సరే షూట్ లేట్ అవకుండా కంప్లీట్ చేశాడు అంటే దానికి కారణం వారాహి అమ్మవారేనని ఈ సినిమాపై ఆమె తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే అందరి ఆకట్టుకుంటున్న అంశం మాత్రం బిగ్ హీరో క్యామియో గురించే. సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రత్యేక పాత్ర కథకు కీలక మలుపు తీసుకువస్తుందని నిర్మాత తెలిపారు. ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఇప్పుడే వెల్లడించబోమని, థియేటర్లో చూసినప్పుడే ప్రేక్షకులు నిజమైన సర్ప్రైజ్ను ఆస్వాదించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఒక్క ప్రకటనతోనే సోషల్ మీడియాలో పలు స్టార్ హీరోల పేర్లు చర్చకు వస్తున్నాయి.
టీజర్‌తో ఇప్పటికే మంచి బజ్ సృష్టించిన ‘మహేంద్రగిరి వారాహి’ ఇప్పుడు ఈ కొత్త అప్డేట్తో మరింత హైప్ తో ముందుకు వెళ్తోంది. నాన్ థియేట్రికల్ హక్కులు తక్కువ సమయంలోనే అమ్ముడవడం, భక్తి పాటలపై నిర్మాత వ్యక్తం చేసిన విశ్వాసం, స్టార్ హీరో సర్ప్రైజ్ రోల్ వంటి అంశాలు సినిమాకు మరింత హైప్ తెచ్చినట్లే కనబడుతోంది. ప్రెస్మీట్లో సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 2026 సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఆఫీషియల్ గా అనాన్స్ కూడా చేశారు ఈరోజు జరిగిన ప్రసాద్ ల్యాబ్ ప్రెస్ మీట్ లో. ఈ నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ 20 నిమిషాల సర్ప్రైజ్ ఎవరిదో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!