Fighter Jet Engines: ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం అమెరికా, ఫ్రాన్స్‌లతో భారత్ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fighter Jet Engines: భారతదేశం రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కోసం హై-పవర్ ఇంజిన్ కోసం ఫ్రాన్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద భారత్‌లోనే భవిష్యత్ యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజిన్లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 2028 నాటికి ఇండక్షన్కు సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) మొదటి విమానానికి ఏడు సంవత్సరాలు పట్టవచ్చు. ఇండక్షన్కి పదేళ్లు పట్టవచ్చు.
Read Also: Cabinet: కేంద్ర కేబినెట్లో మార్పులు.. కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల జూన్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) ను సందర్శించాల్సి ఉంది. అలాగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి ఈ ఏడాది చివర్లో ఫ్రాన్స్‌కు కూడా వెళ్లనున్నారు. రెండు జెట్ ఇంజిన్ల పనితీరును అలాగే ధరకు సంబంధించిన అంశాలను, సాంకేతికత, తయారీని బదిలీ చేసే పరిధిని భారతదేశం మూల్యాంకనం చేస్తోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్ ఎంకే2, అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అనేవి రెండు ప్రధాన యుద్ధ విమానాలు. వీటి తయారీ ప్రాజెక్టులు ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నాయి. భారతదేశం 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. మొదటిసారిగా విదేశీ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత్ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!