Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Imports Record Lpg From Argentina As Iran War Blocks Hormuz Strait

LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..

Published Date :March 25, 2026 , 7:14 pm
By BV Reddy
  • కష్టకాలంలో మిత్రదేశం సాయం..
  • 20 వేల కి.మీ దూరం నుంచి వంట గ్యాస్..
LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..
  • Follow Us :
  • google news
  • dailyhunt

LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు-గ్యాస్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జలమార్గం ద్వారా 20 శాతం ఇంధన రవాణా జరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. భారత్‌లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా వంట గ్యాస్‌పై ప్రజలు భయాందోళనలో ఉన్నాయి. మనం దిగుమతి చేసుకునే LPGలో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుండటంతో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మిత్రదేశం భారత్‌ కోసం సాయానికి ముందుకు వచ్చింది. భారత్ సుదూరంలో ఉన్న అర్జెంటీ నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతోంది. 2024కు ముందు అర్జెంటీ నుంచి భారత్ గ్యాస్ సరఫరా అసలే లేదు. మోడీ ప్రభుత్వం ఇంధన దిగుమతుల కోసం కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా చాలా దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. కానీ 2026లో తొలి 3 నెలల్లోనే అర్జెంటీనా నుంచి భారత్‌కు 50,000 టన్నుల ఎల్పీజీ దిగుమతులు వచ్చాయి. 2025లో ఈ దేశం నుంచి భారత్ 22,000 టన్నుల దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా LPG దిగుమతులు పెరిగాయి.

Read Also: Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..

ఇప్పటికే అర్జెంటీనాలోని బహియా బ్లాంకా ఓడరేవు నుంచి ఎల్పీజీ నౌకలు బయలుదేరాయి. మార్చ్ మొదటి వారంలో భారత్ చేరుకుంటాయి. అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలో చిట్టచివర ఉంది. ఇక్కడి నుంచి భారత్ రావాలంటే నౌకలు సుమారుగా 20,000 కిలోమీటర్లు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంపై ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అత్యంత పొడవైన నౌకా మార్గాల్లో ఒకటి. ఈ దూరం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవుతున్నా, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో మాట్లాడుతూ.. తమ వద్ద అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం గ్యాస్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్ ఇప్పటికే అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాము.

#WATCH | Delhi: Reacting to the reports of India importing energy and gas from Argentina, Mariano Agustín Caucino, Ambassador of Argentina to India, says, "India is becoming the fourth-largest economy, and is going to be the third-largest economy. It's a great importer of energy,… pic.twitter.com/9b2VwtIR3x

— ANI (@ANI) March 25, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gas supply route
  • global energy crisis
  • India Argentina LPG deal
  • India energy security
  • India's strategic fuel reserves

తాజావార్తలు

  • Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..

  • LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..

  • Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..

  • Uppudu Pindi: షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసేయండి!

  • Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions