Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా రూ.3.40 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. శ్రీరామ నవమికి ముందే భక్తులకు ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం రాళ్లు, ముళ్లతో నిండిపోయి ఉండేది. అయినప్పటికీ భక్తులు ఎంతో కష్టపడి ప్రదక్షిణ చేసేవారు. ఈ సమస్యలను స్థానిక ప్రజలు, ఎమ్మెల్యే లోకం మాధవి దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించి, మార్గాన్ని సౌకర్యవంతంగా మార్చింది.
Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గత 20 నెలల్లో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, ఇతర నిధుల ద్వారా రూ.40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం గిరిప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, అలాగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గానికి రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
రామతీర్థం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో రామాయణ, మహాభారత కాలానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!