SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo Y11 5G & Y21 5G Launch: వివో ఇండియా (Vivo India) స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ‘Y’ సిరీస్‌ను విస్తరిస్తూ కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. vivo Y21 5G & vivo Y11 5G పేర్లతో వచ్చిన ఈ మొబైల్స్ దీర్ఘకాల బ్యాటరీ, బలమైన నిర్మాణం, రోజువారీ పనులకు సరిపోయే పనితీరుకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ఈ ఫోన్లు ‘గ్రేటర్ నోయిడా’ తయారీ కేంద్రంలో తయారవ్వడం విశేషం.
ఈ రెండు ఫోన్లలో చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ, కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. రెండు ఫోన్లలో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డిమెంసిటీ 6300 (MediaTek Dimensity 6300) ఉపయోగించారు. కెమెరా విషయానికి వస్తే, Y21 5Gలో 50MP మెయిన్ కెమెరా ఉండగా, Y11 5Gలో 13MP కెమెరా ఉంది. రెండు ఫోన్లలోనూ 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ఈ ఫోన్లలో ప్రధాన హైలైట్ 6500mAh భారీ బ్యాటరీ. కంపెనీ ప్రకారం బ్యాటరీ 48 గంటలకుపైగా వీడియో ప్లేబ్యాక్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతేకాదు 5 సంవత్సరాల వరకు బ్యాటరీ హెల్త్ గ్యారెంటీ ఇస్తోంది కంపెనీ. చార్జింగ్ విషయానికి వస్తే.. Y21 5Gలో 44W ఫాస్ట్ చార్జింగ్, Y11 5Gలో 15W చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇంకా ఈ రెండు ఫోన్లు IP65 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ స్ప్లాష్ నుంచి రక్షణ ఇస్తాయి. అలాగే SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది.
ఇంకా ఇందులో మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్, కాంపోజిట్ బ్యాక్ కవర్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే వీటిలో 6.74 అంగుళాల డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ వల్ల కళ్లకు తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఫోన్లు OriginOS 6 పై పనిచేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించబడింది. గూగుల్ జెమినీ, AI ఫోటో ఎన్హన్స్, AI డాక్యుమెంట్స్, సర్కిల్ టూ సెర్చ్ విత్ గూగుల్ వంటి AI ఫీచర్లు కలిగి ఉన్నాయి. వీటికి అదనంగా 5G USB టైప్-C, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు :
vivo Y21 5G ధరలు:
* 4GB + 128GB: రూ. 18,999
* 6GB + 128GB: రూ. 20,999
* 8GB + 128GB: రూ. 22,999
vivo Y11 5G ధరలు:
* 4GB + 64GB: రూ. 14,999
* 4GB + 128GB: రూ. 16,999
Sravanthi Chokkarapu: పాత వీడియోలతో కుట్ర.. యాంకర్ స్రవంతి సంచలన వివరణ
ఈ ఫోన్లు వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా Y21 5Gపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, Y11 5Gపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్, 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్, Jio ప్రత్యేక ఆఫర్ కింద రూ.1,199 ప్లాన్‌పై 2 నెలల పాటు 10 OTT యాప్స్ ఉచితం, V-Shield ప్రొటెక్షన్ ప్లాన్, ఫ్రీ సర్వీస్ డేస్ వంటివి లభిస్తాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!