చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. మే నెలలో భారత దేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌లో దాదాపు 42 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ దేశం చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి.