DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DME Fuel: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఎల్పీజీ (LPG) ధరలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ ఇంధన సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు భారత్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసింది. అదే DME (డైమిథైల్ ఈథర్). ఇది విదేశీ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, సామాన్యుడి జేబుకు కూడా ఊరటనివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read
ఏమిటీ DME..
DME అనేది మిథనాల్‌ను ఉపయోగించి కృత్రిమంగా తయారుచేసే ఒక ప్రత్యేక వాయువు. దీని ప్రత్యేకత ఏమిటంటే, దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాలు (బయోమాస్, బొగ్గు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్) సులభంగా దొరుకుతాయి. రసాయన పరంగా LPG, DME ఒకేలా ఉంటాయి. దీని ఉపయోగం ఏమిటంటే.. దీనిని నేరుగా వంట గ్యాస్‌గా వాడవచ్చు లేదా ఎల్పీజీతో కలిపి (Blending) ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనం అని విశ్లేషకులు చెబుతున్నారు.
పాత స్టవ్.. పాత సిలిండర్.. కొత్త ఖర్చుల్లేవు..
సాధారణంగా కొత్త గ్యా్స్ మార్కెట్లోకి వస్తుందంటే, కొత్త స్టవ్ లేదా సిలిండర్ కొనాలేమోనని సామాన్యులు ఆందోళన చెందుతారు. కానీ DME విషయంలో ఆ అవసరం లేదని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే DMEని వాడవచ్చని అంటున్నారు. మీ ఇంట్లో ఉన్న సిలిండర్లు, రెగ్యులేటర్లు, గ్యాస్ పైపులు, బర్నర్ స్టవ్‌లు దీనికి సరిగ్గా సరిపోతాయని వెల్లడించారు. ఇప్పటికే ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (BIS) దీని వినియోగానికి సంబంధించిన సాంకేతిక ప్రమాణాలను ఖరారు చేసింది.
ప్రస్తుతం భారత్ తన వంట గ్యాస్ అవసరాల కోసం అధికంగా ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ యుద్ధాల వల్ల ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ‘CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ’ (NCL) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి పరిశోధనలు ముమ్మరం చేశారు. దీని ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచి, ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్వదేశీ ప్రణాళిక విజయవంతమైతే, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినా మనపై ఆ ప్రభావం పడదు. భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇదొక కీలక అడుగు కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
తాజావార్తలు
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!