Site icon NTV Telugu

DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే

Dme Fuel

Dme Fuel

DME Fuel: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఎల్‌పీజీ (LPG) ధరలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ ఇంధన సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు భారత్ ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసింది. అదే DME (డైమిథైల్ ఈథర్). ఇది విదేశీ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, సామాన్యుడి జేబుకు కూడా ఊరటనివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!

ఏమిటీ DME..
DME అనేది మిథనాల్‌ను ఉపయోగించి కృత్రిమంగా తయారుచేసే ఒక ప్రత్యేక వాయువు. దీని ప్రత్యేకత ఏమిటంటే, దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాలు (బయోమాస్, బొగ్గు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్) సులభంగా దొరుకుతాయి. రసాయన పరంగా LPG, DME ఒకేలా ఉంటాయి. దీని ఉపయోగం ఏమిటంటే.. దీనిని నేరుగా వంట గ్యాస్‌గా వాడవచ్చు లేదా ఎల్‌పీజీతో కలిపి (Blending) ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనం అని విశ్లేషకులు చెబుతున్నారు.

పాత స్టవ్.. పాత సిలిండర్.. కొత్త ఖర్చుల్లేవు..
సాధారణంగా కొత్త గ్యా్స్ మార్కెట్లోకి వస్తుందంటే, కొత్త స్టవ్ లేదా సిలిండర్ కొనాలేమోనని సామాన్యులు ఆందోళన చెందుతారు. కానీ DME విషయంలో ఆ అవసరం లేదని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎల్‌పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే DMEని వాడవచ్చని అంటున్నారు. మీ ఇంట్లో ఉన్న సిలిండర్లు, రెగ్యులేటర్లు, గ్యాస్ పైపులు, బర్నర్ స్టవ్‌లు దీనికి సరిగ్గా సరిపోతాయని వెల్లడించారు. ఇప్పటికే ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (BIS) దీని వినియోగానికి సంబంధించిన సాంకేతిక ప్రమాణాలను ఖరారు చేసింది.

ప్రస్తుతం భారత్ తన వంట గ్యాస్ అవసరాల కోసం అధికంగా ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ యుద్ధాల వల్ల ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ‘CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ’ (NCL) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి పరిశోధనలు ముమ్మరం చేశారు. దీని ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచి, ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్వదేశీ ప్రణాళిక విజయవంతమైతే, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినా మనపై ఆ ప్రభావం పడదు. భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇదొక కీలక అడుగు కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!

Exit mobile version