India vs Pakistan: పాకిస్థాన్ కు నీటిని ఆపేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi river water flow: పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ తాజా పరిణామంతో రావి జలాలన్నీ మన దేశానికే ఉపయోగపడబోతున్నాయి. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్- పాక్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం- సింధూ ఉపనది అయిన రావి జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని గతంలో ఇండియా నిర్ణయించింది.
Read Also: Egypt: నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
అందులో భాగంగానే 1979లో పంజాబ్- జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యామ్, కింది వైపు షాపుర్ కండీ బ్యారేజ్‌ను నిర్మించాలని ఈ రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం 2001లోనే పూర్తి కాగా, షాపుర్ కండీ పనులు అనేక ఆటంకాలతో ఆగిపోయాయి. దీంతో పాక్‌కు నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే, 2008లో షాపుర్ కండీ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణ పనులు ఆరంభించారు. కానీ, పంజాబ్, జమ్మూకశ్మీర్ల మధ్య విభేదాలతో ఏడాదికే మళ్లీ పనులు నిలిచిపోయాయి.
Read Also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
ఇక, చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం చేయడంతో షాపుర్ కండీ బ్యారేజీ నిర్మాణం తిరిగి మొదలైంది. ఎట్టకేలకు ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 25 నుంచి నుంచి పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో 55.5 మీటర్ల ఎత్తైన షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో.. ఇన్నాళ్ల పాటు పాక్‌కు వెళ్లిన నీటిని ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లీస్తున్నారు.
తాజావార్తలు
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!