NTV Telugu Site icon

IND vs SA 2nd Test: 153 పరుగులకు భారత్‌ ఆలౌట్.. ‘0’ పరుగులకే 6 వికెట్లు

India

India

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ పరిస్థితిని మార్చేశారు. భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే ఆరు వికెట్లు కోల్పోయింది. 153/4గా ఉన్న భారత్‌ అదే స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో కనీసం 200 పరుగుల ఆధిక్యం అయినా దక్కుతుందన్న భారత అభిమానుల ఆశలు తలకిందులయ్యాయి. భారత్ ఎదుర్కొన్న చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు చేయకుండానే 6 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది.

Read Also: Iran: ఖాసిం సులేమానీ సమాధి దగ్గర రెండు భారీ పేలుళ్లు.. 73 మంది మృతి !

సౌతాఫ్రికా బౌలర్‌ ఎంగిడి వేసిన ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌(8), రవీంద్ర జడేజా(0), జస్‌ప్రీత్ బుమ్రా(0) పెవిలియన్‌ చేరారు. మరో బౌలర్ రబాడ వేసిన తర్వాతి ఓవర్‌లో కోహ్లీ(49), సిరాజ్‌(0), ప్రసిద్ధ్‌ కృష్ణ(0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.