దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు.