ఇండియా కూటమి ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ లుకలుకలు వినపడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు.
INDIA Bloc: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి తన స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలిగి మళ్లీ బీజేపీతో జతకట్టాడు. మరోవైపు కాంగ్రెస్‌తో టీఎంసీ, ఆప్ పార్టీలకు మధ్య సీట్ల షేరింగ్ గురించి విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…