INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- ఇండియా కూటమి సమావేశానికి విజయ్‌కి నో ఎంట్రీ..
- కారణాలు వెల్లడించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 2 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), తమిళనాడులో డీఎంకే ఓటమి తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి సుప్రియా సూలే వంటి నేతలు హాజరయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్‌తో విభేదాల కారణంగా డీఎంకే ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. ఇక ఆప్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
ఉద్ధవ్ ఠాక్రే వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుండి అఖిలేష్ యాదవ్, సీపీఎం నుండి జాన్ బ్రిట్టాస్, సీపీఐ నుండి డి రాజా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుండి పీకే కుంజలికుట్టి, కేరళ కాంగ్రెస్ నుండి జోస్ కే మణి, ఆర్ఎస్పీ నుండి ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నుండి టి తిరుమావళవన్, ఎండీఎంకే నుండి వైకోలు హాజరయ్యారు.
Also Read
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- China: "మనం శత్రువులం కాము".. భారత్‌కు చైనా సందేశం..
అయితే, తమిళనాడు నుంచి డీఎంకే హాజరు కాలేదు. కానీ ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం విజయ్ పార్టీ టీవీకేను ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. దశాబ్ధాల డీఎంకే, అన్నాడీఎంకేలా ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టిన పార్టీని ఆహ్వానించకపోవడం ఏంటని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.
ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్లో సభ్యత్వం ఉన్న పార్టీలను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు చెప్పింది. విజయ్ టీవీకే పార్టీకి పార్లమెంట్లో ఏ సభలో కూడా ప్రతినిధులు లేరు. అందుకే ఇండియా బ్లాక్ సమావేశానికి ఆహ్వానించలేదని చెప్పింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!