NTV Telugu Site icon

IND vs BAN: ఉప్పల్‌లో మ్యాచ్.. స్టేడియం వద్ద భారీ బందోబస్తు

Rajiv Gandhi

Rajiv Gandhi

రేపు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు టీ20ల్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. ఈ క్రమంలో.. ఇరు జట్ల సభ్యులు నిన్న (గురువారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Read Also: AP Govt: పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్‌ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు. అంతేకాకుండా.. 10 వజ్రా వెహికిల్స్‌, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీసులతో భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఎస్బీ, సీసీఎస్ సిబ్బంది, ఎస్వోటీ, 2 ఫైర్ టెండర్లతో బందోబస్తు పకడ్బందీగా ఉన్నారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తెలిపారు. 300 సీసీ కెమెరాలతో పాటు బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని సీపీ పేర్కొన్నారు.

Read Also: Dog Singing Video: ఇంగ్లీష్‌ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..