Asia Cup Final: ఆసియా కప్ అంటేనే రెచ్చిపోతున్న శ్రీలంక.. ఏకంగా 12 సార్లు ఫైనల్‌కు! భారత్ మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంటాడినా, భారీ లక్ష్యం ముందున్నా, భీకర పేసర్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. చివరి బంతి వరకూ పోరాడి అనూహ్య విజయం సాధించింది. ఆసియా కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది.
ఆసియా కప్ 2023లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఒక్క టీమిండియాపైనే ఓడింది. నాలుగు విజయాలతో ఫైనల్‌కు చేరింది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అఫ్గాన్లపై విజయాలు అందుకున్న లంక.. సూపర్-4లో పాక్, బంగ్లాపై విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే సూపర్-4 బెర్త్ కోసం అఫ్గాన్‌తో పోరాడిన తీరు అద్భుతం. చివరి వరకూ గెలుపు అవకాశాలు అఫ్గాన్‌కే ఉన్నా.. పట్టు వదలకుండా పోరాడి 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. లంక నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని 37.1 ఓవర్లో ఛేదిస్తే.. రన్‌రేట్ ప్రకారం అఫ్గాన్ సూపర్-4కు చేరుకుంటుంది. అయితే అఫ్గాన్ 37 ఓవర్లకు 289/8తో నిలిచింది.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
Also Read: iPhone 15 Price: భారత్‌లో కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15 ఫోన్స్.. ఏకంగా 50 శాతం! ఎక్కడో తెలుసా?
సూపర్-4లో పాక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక ఏకంగా 12వ సారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరడం టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు. ఆసియా కప్‌లో భారత్ ఇప్పటివరకు 11 సార్లు ఫైనల్స్ చేరి.. 7 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. మరోవైపు ఇప్పటివరకు 11 ఫైనల్స్ ఆడిన లంక.. ఆరు సార్లు విన్నర్‌గా.. ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2023 ఫైనల్లో టీమిండియాను ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..