Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cinema: ఇప్పుడు ఒక సినిమా ఎంత వసూలు చేసింది? మొదటి రోజు ఎంత వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టింది? అనే లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందో చూస్తే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది. తక్కువ స్క్రీన్లు, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేసుకోలేని ఆ కాలంలోనే కొన్ని ఇండియన్ సినిమాలు నెలల తరబడి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించాయి. అలాంటి సినిమాల టికెట్ అమ్మకాల జాబితాలో ఏ సినిమా నంబర్ వన్‌లో ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఫిల్మ్ విజన్ పంచుకున్న జాబితా ప్రకారం, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాలలో 1975లో విడుదలైన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా సుమారు 12.73 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. హేమా మాలిని, జయా బచ్చన్, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ వంటి భారీ తారాగణంతో వచ్చిన షోలే అప్పట్లో ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాసి సంచలనంగా మారింది. థియేటర్లలో ఎక్కువ కాలం ప్రదర్శించబడటం కూడా ఈ భారీ టికెట్ అమ్మకాలకు కారణంగా చెప్పొచ్చు.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ఈ జాబితాలో రెండో స్థానంలో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ ఉంది. ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై సుమారు 10.77 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఎంతటి ప్రచారాన్ని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సస్పెన్స్‌కు సమాధానం తెలుసుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు.
ఇక 1960లో విడుదలైన ‘మొఘల్ ఎ ఆజమ్’ కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉంది. దిలీప్ కుమార్, మధుబాల, పృథ్వీరాజ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చారిత్రక చిత్రం సుమారు 9.17 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినట్లు అంచనా. ఆ తర్వాత ఆస్కార్ నామినేషన్ అందుకున్న భారతీయ క్లాసిక్ మదర్ ఇండియా సుమారు 8.89 కోట్ల టికెట్లతో నిలిచింది. ఈ రెండు సినిమాలు విడుదలైన సమయంలో నేటిలా మల్టీప్లెక్స్‌లు, డిజిటల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రచారం ఏదీ లేకపోయినా ఇంత భారీ ప్రేక్షకాదరణ పొందడం వాటి స్థాయిని చెబుతుంది.
ఈ జాబితాలో చోటు సంపాదించిన మరో సినిమా సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ‘హమ్ ఆప్కే హై కౌన్’. ఇది సుమారు 7.79 కోట్ల టికెట్ల అమ్మకాలతో ఈ సినిమా ఐదో స్థానంలో ఉన్నట్లు సమాచారం. 1990లలో వచ్చిన ఈ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్ అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.
దిలీప్ కుమార్ నటించిన ‘గంగ జమున’ సుమారు 6.36 కోట్ల టికెట్లతో తర్వాతి స్థానంలో ఉండగా, మనోజ్ కుమార్ నటించిన ‘క్రాంతి’ దాదాపు 6.15 కోట్ల టికెట్ల అమ్మకాలతో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచినట్లు ఫిల్మ్ విజన్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ జాబితాలోని చివరి సినిమా కూడా ఆరు కోట్లకు పైగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందన్నమాట.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. పాత సినిమాల టికెట్ అమ్మకాల విషయంలో ఖచ్చితమైన అధికారిక లెక్కలు అందుబాటులో ఉండకపోవచ్చు. నేటిలా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లను ఒకే విధంగా ట్రాక్ చేసే వ్యవస్థ కూడా అప్పట్లో లేదు. అందుకే వివిధ వాణిజ్య వర్గాలు, పరిశ్రమ అంచనాల ఆధారంగా పాత సినిమాల టికెట్ అమ్మకాల సంఖ్యల్లో కొంత తేడా కనిపించవచ్చు.
అయినా ఈ లెక్కలు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సినిమా విజయాన్ని కేవలం వసూళ్లతో మాత్రమే కొలవాల్సిన అవసరం లేదు. టికెట్ ధరలు కాలానుగుణంగా భారీగా మారిపోయాయి. కానీ ఒక సినిమా కోసం నిజంగా ఎంతమంది ప్రేక్షకులు థియేటర్ గేట్లు దాటారనే లెక్క దాని ప్రజాదరణను అర్థం చేసుకోవడానికి మరో ముఖ్యమైన కొలమానం. అందుకే 1975లో వచ్చిన షోలే ఇప్పటికీ టికెట్ అమ్మకాల పరంగా భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నట్లు ఈ జాబితా చెబుతోంది.
- Tags
- cinema
- indian cinema
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?