iPhone 15 Price: భారత్‌లో కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15 ఫోన్స్.. ఏకంగా 50 శాతం! ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్ ధరల గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. భారత దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ఆయా దేశాలతో పోల్చినప్పుడు.. మన దగ్గరే అధికంగా ఉండడం విశేషం. ఐఫోన్ 15 మోడల్ ఆరంభ ధర అమెరికాలో 799 డాలర్లు. అదే భారత్‌లో రూ. 79,900గా ఉంది. 799 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ. 66,353 వేలు అవుతుంది. అయితే ఈ మోడల్ ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్ ఎమిరేట్స్‌లో దీని ధర 3,399 కాగా.. భారత కరెన్సీ (22 రూపాయలు = 1 దిర్హమ్) ప్రకారం రూ. 76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువ.
Also Read
Also Read: World Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ 2023కి స్టార్ పేసర్ దూరం!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ ధర అమెరికాలో 1,199 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే.. రూ. 99 వేలు అవుతుంది. అయితే భారత్‌లో ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 50 శాతం అధికం. దుబాయ్‌లో ఈ మోడల్ ధర 5,099 దిర్హమ్‌లు. దిర్హమ్‌లను భారత కరెన్సీలోకి మారిస్తే 1.15 లక్షలు. ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌దీ అదే పరిస్థితి. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ కొనాలనుకునే వారు.. అవకాశం ఉంటే యూఎస్ లేదా దుబాయ్‌లో కొనేసుకుంటే బెటర్. థాయ్‌లాండ్, చైనాలో కూడా ధరలు తక్కువే ఉన్నాయి.
- Tags
- Apple
- Apple iPhone
- dubai
- india
- iphone
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!