Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Achieves a World Record in 146 Years: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేర్వేరు క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు ఏడు క్యాలెండర్ ఇయర్‌లలో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. 146 ఏళ్లలో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనతను కింగ్ సొంతం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ గతంలో 2012 (2186 పరుగులు), 2014 (2286 పరుగులు), 2016 (2595 పరుగులు), 2017 (2818 పరుగులు), 2018 (2735 పరుగులు), 2019 (2455 పరుగులు)లలో2000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 1877లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచి (అధికారిక రికార్డు ప్రకారం) మరే ఇతర ఆటగాడు ఈ ఫీట్ సాధించలేదు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఆరు క్యాలెండర్ ఇయర్‌లలో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 5 సార్లు ఈఘనత సాధించగా.. జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, మాథ్యూ హేడెన్ 4 సార్లు ఈ ఫీట్ సాధించారు.
Also Read
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
Also Read: ISRO: ఇంటెలిజెన్స్ సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం..
సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. 82 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ.. పదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇక రెండో టెస్టు 2024 జనవరి 3న కేప్‌టౌన్‌లో ఆరంభమవుతుంది.
తాజావార్తలు
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!