Jasprit Bumrah Wins Player of the Series award on South African Soil: 18 నెలల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్స్ పడగొట్టాడు. దాంతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. కేప్ టౌన్ టెస్టులో 8 వికెట్స్ తీశాడు. దాంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్‌తో కలిసి బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. దాంతో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు.
దక్షిణాఫ్రికా గడ్డపై భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సృష్టించారు. సఫారీ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి. ఇక భారత్ తరఫున టెస్టుల్లో ఇలా జరగడం ఓవరాల్‌గా రెండోసారి మాత్రమే. 2014లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భువనేశ్వర్ కుమార్ (తొలి ఇన్నింగ్స్‌లో 6/82), ఇషాంత్ శర్మ (రెండో ఇన్నింగ్స్‌లో 7/74) ఈ ఘనత సాధించారు.
Also Read: IND vs SA: మార్‌క్రమ్ అద్భుతం.. కొన్నిసార్లు బౌలర్లపై ఎటాక్ చేయడమే సరైన నిర్ణయం: సచిన్
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు 5 టెస్టులు మాత్రమే గెలుచుకుంది. జోహనెస్‌బర్గ్‌లో రెండు గెలవగా.. డర్బన్, సెంచూరియన్, కేప్‌టౌన్‌లో ఒక్కొక్కటి గెలిచింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మొత్తం 25 టెస్టుల ఆడగా.. ఐదు టెస్టుల్లో విజయం సాధించింది. 13 టెస్టుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడింటిని డ్రా చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు.