IND Vs SA: భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా?
Also Read
- Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా సూపర్ హిట్ ప్రదర్శన టీం ఇండియా బలమైన స్కోరును చేరుకోవడానికి విశేషంగా సహాయపడింది. పాండ్యా 28 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు బాది, T20లలో 100 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌లను తప్పించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికాకు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదిరే ఆరంభం లభించలేదు. కానీ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. హార్దిక్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌కు బాటలు వేశాడు. తన ఇన్సింగ్స్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు. వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ ఐదు బంతుల్లో 10 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ (26) , అక్షర్ పటేల్ (23), అభిషేక్ శర్మ (17), శుభ్‌మాన్ గిల్ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), శివమ్ దూబే (11) ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేక పోయారు. దక్షిణాఫ్రికా తరఫున లుంగి న్గిడి మూడు వికెట్లు, లూథో సిపామ్లా రెండు, డోనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ లక్ష్యఛేదనలో సఫారీలు 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలారు. డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్. మార్క్రమ్ (14), ట్రిస్టన్ స్టబ్స్ (14), మార్కో యాన్సెన్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. , హార్దిక్ పాండ్య, శివమ్ దూబె తలో వికెట్ తీశారు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాపై విధ్వంసం సృష్టించడంతో తొలి T20Iలో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్ట్జే, లూథో సిపమ్లా, లుంగీ ఎన్గిడి.
READ ALSO: Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!