Huge security for India vs Pakistan Match in ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది. దాంతో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరం అంతా పోలీసుల గుప్పిట్లో ఉంది.
స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్ఎస్‌జీ కమాండోలతో పటిష్ట భద్రతను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది ఉంటుందట. గత 20 ఏళ్లుగా అహ్మదాబాద్ నగరంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ఎలాంటి మత హింస జరగలేదని.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను కూడా అడ్డుకునేలా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అహ్మదాబాద్ సిటీ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు.
Also Read: Budget Smartphones 2023: ‘బిగ్ బిలియన్ డేస్’ టాప్ డీల్స్.. అతి తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్!
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ భద్రతా ఏర్పాట్లపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వి, డీజీపీ వికాస్ సహయ్, కమిషన్ జీఎస్ మాలిక్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భద్రతపై చేర్చించారట. 150 పోలీస్ ఉన్నతాధికారులు, 7000 మంది స్థానిక పోలీసులు, ముగ్గురు డీసీపీ, 18 ఏసీపీలు, 56 ఇన్స్పెక్టర్లు, 117 మంది ఎస్ఐలు, 500 మంది హోం గార్డులతో భద్రత ఏర్పాటు చేశారట. స్టేడియం చుట్టూ 2 వేల సీసీ కెమెరాలు ఉన్నాయట. బాడీ కెమెరాలతో వెయ్యి మంది పోలీసులు ఉంటారు. స్నైపర్ టీమ్స్ కూడా ఉంటుంది. స్టేడియంలో మినీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. అణువణువూ పర్యవేక్షిస్తున్న పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.