IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా
- అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా..
- నేడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
- ఉదయం 10.30 గంటలకు మ్యాచ్..
- ఎక్కడ చుడొచ్చంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK U-19: ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బిసిసిఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఈరోజు (నవంబర్ 30) మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య మరో గొడవ జరగనుంది. అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్‌తో పోటీపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, జపాన్, ఆతిథ్య యూఏఈతో పాటు భారత్ గ్రూప్-బిలో ఉంది. కాగా డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ గ్రూప్-ఎలో ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 6న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 8న ఫైనల్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియంలలో ఈ టోర్నీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
Also Read: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
Also Read
మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిదోసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ముందుగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలంలో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ భారత్, పాకిస్తాన్ మధ్య అండర్ -19 ఆసియా కప్ మ్యాచ్‌ను టీవీలో ప్రసారం చేస్తుంది.
Also Read: Astrology: నవంబర్ 30, శనివారం దినఫలాలు
అండర్-19 ఆసియా కప్ కోసం భారత జట్టు: ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, సి ఆండ్రీ సిద్ధార్థ్, మహ్మద్ అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే (వైస్ కెప్టెన్), ప్రణబ్ పంత్, హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), అనురాగ్ కౌడే (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్ , మహ్మద్ అనన్, KP కార్తికేయ, సమర్థ్ నాగరాజ్, యుధ్జిత్ గుహ, చేతన్ శర్మ, నిఖిల్ కుమార్. రిజర్వ్ ఆటగాళ్లు: సాహిల్ పరాఖ్, నమన్ పుష్పక్, అన్మోల్జీత్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, డి దీపేష్.
అండర్-19 ఆసియా కప్ కోసం పాకిస్థాన్ జట్టు: సాద్ బేగ్ (కెప్టెన్/వికెట్ కీపర్), మహ్మద్ అహ్మద్, హరూన్ అర్షద్, తయ్యబ్ ఆరిఫ్, మహ్మద్ హుజెఫా, నవీద్ అహ్మద్ ఖాన్, హసన్ ఖాన్, షాజెబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఫహమ్-ఉల్-హక్, అలీ రజా , మహ్మద్ రియాజుల్లా, అబ్దుల్ సుభాన్, ఫర్హాన్ యూసుఫ్, ఉమర్ జైబ్
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!