Rohit Sharma: సగం లక్ష్యమే పూర్తయింది.. ముందుంది అసలు పండగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను రోహిత్ సేన ఓడించింది. భారత్ విజయంలో షమీ, కోహ్లీ, జడేజాలు కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. టోర్నీలో ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ వెళుతున్నాం. ప్రపంచకప్ విజయంలో మా లక్ష్యం ఇంకా సగమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడం కీలకం. తర్వాత మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. మొహ్మద్ షమీ వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. షమీ లాంటి క్లాస్ బౌలర్‌కు ధర్మశాల వంటి పిచ్ అనుకూలంగా ఉంటుందని నిరూపించాడు. ఓ దశలో న్యూజిలాండ్ 300లకు పైగా స్కోరు చేస్తుందని అనుకున్నా. షమీ సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. అందరూ బాగా బౌలింగ్ చేశారు… ఈ విజయం బౌలర్లదే’ అని అన్నాడు.
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
Also Read: Mohammed Shami: ఆ వికెట్‌తో నాలో మరింత నమ్మకం పెరిగింది: షమీ
‘నేను నా బ్యాటింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తా. వేర్వేరు వ్యక్తిత్వాలు గల నేను, గిల్ మాట్లాడనుకుంటూ ముందుకు వెళ్లాం. చివరకు విజయం సాధించడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. గత కొన్నేళ్లుగా తన ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. వికెట్స్ కోల్పోయినప్పుడు కోహ్లీ, జడేజాల భాగస్వామ్యం విజయానికి దగ్గర చేసింది. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అన్నింటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. విభిన్న ప్రాంతాల్లో మ్యాచ్‌లు ఆడడాన్ని మేం ఆస్వాదిస్తున్నాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!