IND vs ENG Test: ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో లీడ్ పొందలేకపోయింది. మొదటి ఇనింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో కె.ఎల్. రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించారు. మరి మ్యాచ్ మూడో రోజు మ్యాచ్ ఎలా సాగిందంటే..
Read Also:Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్..
భారత ఓపెనర్ కె.ఎల్. రాహుల్ లార్డ్స్ మైదానంలో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. 117 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేశారు. లార్డ్స్‌లో రెండోసారి శతకం బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ కన్నా ఎక్కువగా ఈ మైదానంలో పరుగులు చేసిన భారత క్రికెటర్ దిలీప్ వెంగసర్కర్ (3 శతకాలు) మాత్రమే. ఇది SENA దేశాల్లో రాహుల్ వేసిన ఏడో టెస్ట్ శతకం. ఈ లిస్ట్‌లో 5వ స్థానంలో ఉన్నారు.
మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ టాప్ ఫామ్‌లో కనిపించినా, చిన్న పొరపాటు వల్ల ఔటయ్యాడు. కవర్ పాయింట్ వైపు షాట్ ఆడిన పంత్, అనవసర రన్ ను తీయబోయి బెన్ స్టోక్స్ డైరెక్ట్ త్రోకి బలయ్యాడు. పంత్ 112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశారు. రాహుల్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యం అందించారు. పంత్, రాహుల్ ఔటైన తర్వాత రవీంద్ర జడేజా సమన్వయంగా బ్యాటింగ్ చేశాడు. జడేజా 131 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 72 పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్‌లో అతనికి ఇది 25వ అర్ధశతకం. ఇక భరత ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 23 పరుగులు చేశారు.
Read Also:Kota SrinivasRao : కోట శ్రీనివాసరావుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా, అదే స్కోరుకు భారత్ ను కూడా 119.2 ఓవర్లలో 387 పరుగులు చేసింది. జడేజా ఔట్ అయిన తర్వాత భారత్ చివర్లో 10 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (23) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు సమం కావడంతో, భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందలేకపోయింది. ఇక మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్లో 2 పరుగులు చేసింది. జాక్ క్రౌలీ 6 బంతుల్లో 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. బెన్ డకెట్ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.
అయితే ఈ ఓవర్‌లో క్రౌలీ, డకెట్ ఇద్దరూ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను అడ్డుకోవడానికి సమయం ఆలస్యం చేసేలా ప్రయత్నం చేశారు. గ్లోవ్స్ అడగడం, సంభాషణలతో ఆటను ఆలస్యం చేశారు. ఈ ఆట తీరుపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసహనం వ్యక్తం చేశాడు. దానితో చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగింది. ఇలా మూడవ రోజు సాగింది.