IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై భారత పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ది ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ చివరి రోజు ఉదయం సెషన్‌లో ఇంగ్లండ్ విజయానికి కేవలం 20 పరుగులు మాత్రమే అవసరం. 81 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 354 పరుగుల వద్ద మ్యాచ్ కొనసాగుతుంది. దీనితో విజయం ఎవరిని వరిస్తుందో అని ఇరు దేశ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Chairman’s Desk : వీసాలు, సుంకాలు, యుద్ధం..అడుగడుగునా వెన్నుపోటేనా? Trump ఎందుకిలా చేస్తున్నాడు?
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (57), సాయి సుధర్శన్ (38), శుభ్‌మన్ గిల్ (21) స్కోర్లు అందించినా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విఫలమైంది. గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లు తీసి భారత టాపార్డర్‌ను కుదేలు చేశాడు. టంగ్‌కు మూడు వికెట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43), హ్యారీ బ్రూక్ (53) నిలకడగా ఆడారు. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు నుంచి అడ్డుకున్నారు.
Zoho CEO : ‘ఆ కాల్ కలవరపరిచింది’… విదేశీ డిగ్రీలపై శ్రీధర్ వెంబు హెచ్చరిక..!
ఇక ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించింది. 396 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇందులో యశస్వి జైశ్వాల్ 118 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, ఆకాశ్ దీప్ (66), వాషింగ్టన్ సుందర్ (53), జడేజా (53) మద్దతుగా నిలిచారు. ఇంగ్లండ్ పేసర్ టంగ్ ఈ ఇన్నింగ్స్‌లో కూడా ఐదు వికెట్లు తీసి చెలరేగాడు. దీనితో 374 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఒక దశలో 106/3 స్థితిలో ఉండగా.. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) మధ్య భారీ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. చుడాలిమరి చివరకు విజయం ఎవరిని వరిస్తుందో.