India need 231 to win Hyderabad Test: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 102.1 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 246, భారత్ 436కి ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఓవర్‌నైట్ స్కోర్ 148తో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్ నాలుగో రోజూ జోరు కనబరిచాడు. ఆట ఆరంభంలోనే రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్కోర్ 400 దాటించాడు. టామ్ హార్ట్‌లీ (34)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించి.. ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 200 దాటించాడు. అయితే హార్ట్‌లీను ఆర్ అశ్విన్ బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్‌ను జడేజా ఔట్ చేశాడు. ఆపై పోప్ డబుల్ సెంచరీ కలను బుమ్రా చిదిమేశాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read: IND vs ENG: రవిచంద్రన్ అశ్విన్ మ్యాజికల్ డెలివరీ.. బిత్తరపోయిన బెన్ స్టోక్స్!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. జడేజా (87), రాహుల్ (86), జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్స్ పడగొట్టాడు. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య దేదనకు దిగుతుంది.