IND vs ENG 4th Test: గెలుపు వాకిట తడబడుతున్న టీమిండియా.. విజయానికి ఎంత కావాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు ఒక్కసారిగా తడబడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాటికి స్వల్ప వ్యవధిలో 5 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్‌లు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 40 పరుగులు కావాలి. మరోవైపు సిరీస్ సమం చేసేందుకు ఇంగ్లండ్‌కు మరో 5 వికెట్లు అవసరం. దాంతో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.
ఓవర్ నైట్ స్కోర్ 40/0తో నాలుగో రోజు ఆరంబించిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడారు. జో రూట్ వేసిన బంతికి యశస్వి (37) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ (55) టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ముందుకొచ్చి ఆడబోయి రోహిత్.. స్టంపౌట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రజత్ పటీదార్ (0) బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 100 పరుగులకు భారత్ మూడు వికెట్‌లను కోల్పోయింది.
Also Read
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
Also Read: Sara Arjun: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఐశ్వర్య రాయ్!
ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. శుభ్‌మన్ గిల్ క్రీజులో పాతుకుపోయాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 37 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 118 రన్స్ చేసింది. లంచ్ తర్వాత భారత్‌కు డబుల్ షాక్ తగిలింది. బషీర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) ఔట్ అయ్యారు. 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను గిల్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. ఇద్దరు బౌండరీలు పోకుండా.. సింగిల్స్ తీస్తూ టీమిండియాను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!