Sara Arjun Act as a Heroine: సారా అర్జున్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విక్రమ్ ‘నాన్న’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం ‘సైవం’ చిత్రంలో నటించిన సారా.. ఇటీవల మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మెరిసింది. ఈ సినిమాలో యుక్త వయసులో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. యువత హృదయాలను కొల్లగొడుతోన్న యంగ్ బ్యూటీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన దివంగత దర్శకుడు జీవా వారసురాలు సనా మరియం త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నారు. సనా దర్శకత్వం వహించనున్న సినిమాలో సారా అర్జున్ కథానాయికగా పరిచయం కానుంది. పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్ చిన్ననాటి పాత్రను పోషించిన సంతోష్.. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని తెలుస్తోంది. అవ్నీ పిక్చర్స్ పతాకంపై సుందర్ సి, కుష్బూ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Also Read: Mohan Babu: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. మోహన్ బాబు సంచలన లేఖ!
2005లో జన్మించిన సారా అర్జున్ తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’ సినిమాలో నటించింది. జెర్సీ సినిమా డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి కొత్త నటులతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందో చూడాలి.