Umpire Richard Kettleborough not giving a wide when Virat Kohli was batting: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ విజయం సాదించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో అదరగొట్టాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. శతకం బాదిన విరాట్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే కోహ్లీ సెంచరీ బాదే ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత జట్టు విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చింది. దాంతో లోకేష్ రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడి.. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్ కోసం విరాట్ ప్రయత్నించినా.. రాహుల్ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసేసరికి కోహ్లీ 97 పరుగులతో ఉన్నాడు. జట్టు విజయానికి ఇంకా రెండు పరుగులే అవసరం అయ్యాయి. దాంతో విరాట్ సెంచరీ చేస్తాడా? లేదా? అని అందరిలో ఆసక్తి పెరిగింది.
Also Read: Virat Kohli-Ravindra Jadeja: నన్ను క్షమించేసేయ్ జడేజా.. అది అలా జరిగిపోయింది: విరాట్ కోహ్లీ
నసుమ్ అహ్మద్ వేసిన 42వ ఓవర్ తొలి బంతి లెగ్‌సైడ్ వెళ్లడంతో.. అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో వైడ్ ఇస్తాడా? అన్ని అందరూ టన్షన్ పడ్డారు. వైడ్ ఇస్తాడా? ఏంటి అన్నట్లు విరాట్ కోహ్లీ కూడా చూశాడు. విరాట్ కాస్త లోపలికి జరిగాడని భావించి.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దాంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. డగౌట్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ అయితే చిరునవ్వులు చిందించాడు. ఇక అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఇచ్చినఎక్స్‌ప్రెషన్స్ హైలెట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మూడో బంతికి సిక్సర్ బాదిన విరాట్ శతకం అందుకున్నాడు.
The wide ball incident with umpire not giving it because of #ViratKohli century is cool for Indian but it’s not good for the game
Let’s assume a scenario where the match is close and a wide can make huge difference#indiavsbangladesh#INDvBAN#CricketWorldCup2023#umpire pic.twitter.com/P5GwuOjyC2
— Arvind Kumar( ⚛️) (@antar_dwand) October 19, 2023