IND vs BAN: జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. ఎవరికీ వెసులుబాటు లేదు!
- ఈరోజు రాత్రి బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్
- ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి
- జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో బంగ్లా మ్యాచ్‌లో టీమ్ మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతిని ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఆసియా కప్ 2025లోని మిగతా మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని టీమిండియా సహాయక కోచ్ రైన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. అంతేకాదు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆడుతాడని తెలిపాడు.
‘పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌తో పాయింట్ల టేబుల్ ఎలా ఉంటుందో మేం ఓ అంచనాకు వచ్చాం. ఓ మ్యాచ్ ఉండగానే ఫైనల్‌కు చేరుకోవాలని భావిస్తున్నాం. చివరి మ్యాచ్‌లో అవకాశం తీసుకోకూడదని అనుకుంటున్నాము. తుది జట్టు ఎంపికలో ఎవరికీ ఎలాంటి వెసులుబాటు లేదు. జస్ప్రీత్ బుమ్రాకూ విశ్రాంతిని ఇవ్వము. వచ్చే వారంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ విషయంలో మేం జాగ్రత్తగానే ఉన్నాం. ఆసియా కప్ 2025లో అత్యుత్తమ జట్టునే బరిలోకి దింపుతాం’ అని రైన్ టెన్ డస్కటే తెలిపాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారని, బుమ్రా బంగ్లాదేశ్‌పై ఆడడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకి డస్కటే పులిస్టాప్ పెట్టాడు.
Also Read
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!