IND vs AUS Day 4 Tea break: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్ రెండు జట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందో స్పష్టమవుతుంది. భారత్ కనీసం నాలుగు టెస్టుల్లో విజయం సాధించాలి. అంతేకాకుండా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా చూసుకోవాలి. ఇక మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ను చేసిన టీంఇండియా ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది.
Read Also: Aloe Vera Gel: చలికాలంలో చుండ్రుకు దూరంగా ఉండాలంటే కలబందను ఇలా ఉపయోగిస్తే సరి
ఇందులో భాగంగా నాలుగో రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 307 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆలిస్ క్యారె 30 పరుగులతో, నాథన్ లియోన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆదివారం నాడు ఆస్ట్రేలియా నాథన్ మెక్‌స్వీనీ (0), పాట్ కమిన్స్ (2), మార్నస్ లాబుస్‌చాగ్నే (3) వికెట్లను కోల్పోయింది. ఈరోజు ఉస్మాన్ ఖవాజా (4), స్టీవ్ స్మిత్ (17), ట్రావిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) పరుగుల రూపంలో ఆస్ట్రేలియా వికెట్లను కోల్పోయింది. ఇప్పటి వరకు సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఇంకా మావో రెండు వికెట్లను నెల కూల్చితే టీమిండియా విజయం అందుకుంటుంది.
Read Also: Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
Tea on Day 4 of the 1st Test.
Three wickets fall in the afternoon session as #TeamIndia are now two wickets away from victory.
Scorecard – https://t.co/gTqS3UPruo…… #AUSvIND pic.twitter.com/5j6MZyeZm2
— BCCI (@BCCI) November 25, 2024