WI vs Ban test match Bangladesh won by 101 runs: 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో బంగ్లాదేశ్ జట్టు విదేశీ గడ్డపై గత 6 మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇదివరకు గడ్డపై బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, దీని తర్వాత వారు భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆపై వెస్టిండీస్‌తో జరిగిన ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చి ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో స్కోర్‌లను సమం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 పరుగులు దాటలేకపోకపోవడంతో విజయకేతనం ఎగురవేశారు.
Also Read: Samagra Kutumba Survey: 15 జిల్లాల్లో పూర్తయిన ఇంటింటి సర్వే
తొలిసారిగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ తర్వాత ఇరు జట్లు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టెస్టు సిరీస్‌లు జరగ్గా అందులో బంగ్లాదేశ్ రెండు సిరీస్‌లను గెలుచుకోగా, మిగిలిన 8 సిరీస్‌లను వెస్టిండీస్ గెలుచుకుంది. ఈ 2024 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్ చివరిసారిగా 2009లో వెస్టిండీస్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ సమయంలో ఆ జట్టు రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌తో వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయి ఇప్పుడు గెలిచింది.
Also Read: Pushpa 2: మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్.. అందరిలోనూ అదే డౌట్
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అయితే, నహిద్ రానా ఐదు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కట్టడి చేసారు. దీని తర్వాత బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 268 పరుగులు చేసింది. దింతో వెస్టిండీస్ 286 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది. దానికి ప్రతిస్పందనగా కరీబియన్ జట్టు కేవలం 185 పరుగులకే కుప్పకూలింది. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ 101 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. టెస్ట్ సిరీస్‌ను వెస్టిండీస్‌తో 1-1తో సమం చేసింది.