NTV Telugu Site icon

T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్..?

Hardik Pandya

Hardik Pandya

T20 ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ తొలిసారిగా నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ పాండ్యా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన కారణంగా ఐసీసీ పురుషుల టి 20 ర్యాంకింగ్స్ అప్డేట్‌ లో నంబర్ 1 ర్యాంక్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్ తర్వాత హార్దిక్ పాండ్యా రెండు స్థానాలు ఎగబాకాడు. హార్దిక్ ఇప్పుడు శ్రీలంక స్టార్ వనిందు హసరంగాతో పాటు టి20 ఆల్‌రౌండర్‌ గా అగ్రస్థానంలో నిలిచాడు.

Pakistan Cricket: ఆర్మీ ట్రైనింగ్ తర్వాత పాక్ జట్టుకు సరికొత్త శిక్షణ.. వీడియోలు వైరల్..

హార్దిక్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ల ముఖ్యమైన వికెట్లను తీయడం ద్వారా ఫైనల్‌ లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దాంతో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్, బాల్‌తో హార్దిక్ మంచి సహకారం అందించాడు. దీంతో ఈ విభాగంలో నంబర్ 1కి చేరిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. టి20 ప్రపంచ కప్ 2024 లలో 8 మ్యాచ్‌ లలో పాండ్యా 144 పరుగులు చేశాడు. అతని సగటు 48 గా ఉంది. ఈ 8 మ్యాచ్‌ లల్లో పాండ్యా 7.64 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసి 11 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్‌ లో పాండ్యా చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయగా, ఆఫ్రికా జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. పాండ్యా కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gang Rape Case : మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులు అరెస్ట్‌

టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందుకున్న భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ర్యాంకింగ్ కూడా మెరుగుపడింది. అతను తాజాగా 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. 2020 తర్వాత ఇది అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇక పొట్టి ప్రపంచ కప్‌ లో 17 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్ 4 స్థానాలు ఎగబాకి 13వ స్థానం దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్‌ కు కూడా టీ20 కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.