Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News In Parliament Winter Sessions Chairman Adjourned The Proceedings Of The House Till 11 Am On November 28

Parliament Winter Session: లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

Published Date :November 27, 2024 , 12:26 pm
By Kothuru Ram Kumar
  • లోక్‌సభలో గందరగోళం..
  • సభ రేపటికి వాయిదా
  • గౌతమ్ అదానిపై చర్చ జరగాలంటూ..
Parliament Winter Session: లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parliament Winter Session: నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పార్లమెంటులోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక నేడు మూడో రోజు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నేటి ఎజెండాలో రైల్వేస్ (సవరణ) బిల్లు 2024ను చర్చ, ఆమోదం కోసం సమర్పించడం ఉంది. వీటితోపాటు ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టబడుతుంది. చమురు రంగం (నియంత్రణ & అభివృద్ధి) సవరణ బిల్లు 2024 కూడా నేడు ఎగువ సభలో చర్చకు రానుంది.

Read Also: Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. కాబోయే వాడిని పరిచయం చేసిన కీర్తి సురేశ్‌!

ఈ నేపథ్యంలో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి గందరగోళం సృష్టించారు. అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేసారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను నిర్వహించడానికి అనుమతించాలని విపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేసారు. అయినా కానీ లోక్‌సభలో విపక్షాల గందరగోళం కారణంగా సభా కార్యక్రమాలు కొనసాగలేదు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, యూపీలోని మీరట్‌కు చెందిన బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ OTT ప్లాట్‌ఫారమ్ ద్వారా అసభ్యకర కంటెంట్‌ను లేవనెత్తుతూ ఒక ప్రశ్న అడిగారు. ఇంతలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దిగి రచ్చ సృష్టించారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ విపక్షాల ఎంపిలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో రెండు సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దింతో లోక్‌సభ అలా ప్రారంభమై.. ఇలా వాయిదా పడినట్లయింది.

Read Also: Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభితా పెళ్లి.. అవన్నీ రూమర్స్!

స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులపై ప్రభావం చూపలేదు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అదానీ గ్రూప్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని, రూల్ 267 కింద దానిపై చర్చ జరపాలని కోరుతూ ఇచ్చిన నోటీసును అనుమతించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత నిరాకరించారు. దీంతో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గందరగోళం మధ్య సభా కార్యక్రమాలను చైర్మన్ ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 11.30 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు మళ్లీ గందరగోళం సృష్టించారు. దాంతో సభా కార్యక్రమాలను చైర్మన్ నవంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chairman Jagdeep Dhankhar
  • national news
  • opposition MPs
  • Parliament Winter Session
  • Rajya Sabha

తాజావార్తలు

  • India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

  • Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…

  • Bengaluru Crime: మహిళ, ఆమె సోదరుడి హత్య.. ప్రేయసి కుమారుడే నిందితుడు..

  • IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!

  • Anthropic: ల్యాప్‌టాప్ అవసరం లేదు, మొబైల్‌లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions