Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది. రీసెంట్గా జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కార్తీక్ సుబ్బరాజ్.. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌పై స్పష్టతనిచ్చారు. “నేను చిరంజీవి గారికి ఒక కథ వినిపించాను. అయితే ఇప్పటివరకు ఏదీ ఫైనల్ కాలేదు. ఆయనతో కలిసి పనిచేస్తానని గట్టిగా ఆశిస్తున్నాను” అంటూ అసలు విషయాన్ని చెప్పారు. గతంలో వీరిద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు కథపై సుదీర్ఘ చర్చలు జరిగాయని వచ్చిన వార్తలు వంద శాతం నిజమేనని ఇప్పుడు తేలిపోయింది. ప్రస్తుతం బాల్ మెగాస్టార్ కోర్టులోనే ఉందని, తన లైనప్‌ను బట్టి చిరంజీవి దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.
‘పిజ్జా’, ‘జిగర్తాండ’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘పేట’ తీసి వింటేజ్ తలైవాను ఎలా చూపించాడో అందరికీ తెలిసిందే. తన హీరోలను పూర్తి స్టైలిష్‌గా, ఎలివేషన్లతో సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో కార్తీక్ దిట్ట. అలాంటి మేకింగ్ ఉన్న డైరెక్టర్ మెగాస్టార్‌తో చేతులు కలిపితే థియేటర్లలో పూనకాలు ఖాయమని మెగా ఫ్యాన్స్ కలలు కంటున్నారు. ఒకవేళ చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరిద్దరి కలయికలో వచ్చే మొదటి చిత్రం ఇదే అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్లో ‘కాకా’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. అటు కార్తీక్ సుబ్బరాజ్ తీసిన తాజా చిత్రం ‘డోరతీ’ ప్రస్తుతం థియేటర్లలో ఇంకా రన్ అవుతోంది. ఈ ఇద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టుల నుంచి కాస్త రిలీఫ్ అవ్వగానే ఈ క్రేజీ కాంబోపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరి వింటేజ్ మెగాస్టార్‌ను వెండితెరపై ఎలా చూడబోతున్నామో తెలియాలంటే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!