OYO Room : ఓయోలో రూం బుక్ చేశాడు.. రాగానే చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OYO Room : అనైతిక సంబంధాల కారణంగా చాలా కుటుంబాలు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయి. ఈ బంధాల కారణంగానే కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. తాజాగా నోయిడాలో ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను పొగొట్టుకుని ఇద్దరు పిల్లల్ని అనాథలను చేసింది. నోయిడాకు చెందిన ఓ మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, ఆమె సోను అనే తన బంధువుతో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఓయో హోటల్‌లో తనను కలవాల్సిందిగా సోనూ మహిళను ఆహ్వానించాడు. ఇద్దరూ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. గదిలోకి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
సోనుకి వేరే అమ్మాయితో పెళ్లయింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో సోను ఆ మహిళను తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక మహిళ మరణించింది. హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్తతో కలిసి నోయిడాలో నివసించేవారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోనుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అక్కడ సంచలనం నెలకొంది. మహిళ మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
తాజావార్తలు
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!