ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్ఆర్హెచ్ టీం సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న జట్టు తాజాగా ఒక్క సీజన్ లో అత్యధిక సిక్స్ లు బాదిన జట్టుగా రికార్డును క్రియేట్ చేసింది. అది కూడా లీగ్ దశలో కేవలం ఎనిమిది మ్యాచ్ లోనే ఈ రికార్డును అందుకుంది. ఇక ఈ రికార్డు సంబంధించి పూర్తి వివరాలు వెళ్తే
Also Read: Balmoori Venkat: హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం..!
ప్రస్తుతం సీజన్ లో ఎనిమిది మ్యాచ్లో 100 సిక్స్ లు బాదేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అంటే ఒక మ్యాచ్లో సగటున 12.5 సిక్సులు కొట్టడం. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్లలో రెండు మ్యాచ్ లలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ 22 సిక్స్ లు కొట్టారు. గురువారం నాడు జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 9 సిక్సులు కొట్టడంతో ఒక్క సీజన్ లో 100 సిక్స్ లు మార్క్ ను అందుకున్న మొదటి జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డ్ సృష్టించింది.
Also Read: CM Revanth Reddy: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు.. హరీష్ కు రేవంత్ కౌంటర్…
ప్రస్తుతం బలమైన బ్యాటింగ్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఉన్న ఆటగాళ్లు ఈ విద్వంసానికి కారకులయ్యారు. ఎదురుగా ఎంత పెద్ద అనుభవమైన బౌలర్ ఉన్న సరే సిక్సర్లు మోత మోగిస్తున్నారు. సిక్సర్ల లిస్టులో దరిదాపుల్లో కూడా ఏ టీం లేదంటే నమ్ముతారా.. లీగ్ స్టేజ్ లోనే ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ అరుదైన రికార్డును అందుకోవడంతో ఇంకా మిగిలి ఉన్న మ్యాచులలో ఎన్ని సిక్స్ లు కొడతారో వేచి చూడాలి మరి.