ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. కానీ GHMC ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందని తెలిపారు. GHMC ఎన్నికల్లో బీర్ఎస్ కు మద్దతు ఇవ్వమని కేసీఆర్ తనను అడిగారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని తాము చెప్పామని ప్రధాని పేర్కొన్నారు.
Earthquake: మరోసారి ఉత్తరాఖండ్‌ను వణికించిన భూకంపం..
GHMC మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను అడిగారని ప్రధాని మోడీ అన్నారు. తాను కూడా NDAలో చేరతానని కేసీఆర్ అడిగారన్నారు. తాను కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తానని మరోసారి ఢిల్లీ వచ్చి కేసీఆర్ తనతో చెప్పారని ప్రధాని తెలిపారు. నేను చాలా చేశాను.. ఇక బాధ్యతలు కేటీఆర్ కు ఇస్తాను ఆశ్వీర్వదించండి అని అన్నారు. అందుకు తాను.. మీరు ఏమైనా రాజులా, యువరాజును సీఎం చేయడానికి అని అడిగానన్నారు. ఎంతో మర్యాద చేశారు.. కేసీఆర్ తీరు చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతివ్వమన్నారు.. కానీ తాను మద్దతు ఇవ్వనని చెప్పానని తెలిపారు. విపక్షంలో కూర్చుంటాం కానీ మద్దతు ఇవ్వబోమని చెప్పామన్నారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పాను కాబట్టే.. ఆ తర్వాత నుంచి కేసీఆర్ తనను కలవడం లేదన్నారు. అదే ఆఖరు రోజు.. మళ్లీ వాళ్లు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేదని ప్రధాని తెలిపారు.
Ashok Gehlot: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’.. సీఎం అశోక్ గెహ్లాట్ క్షమాపణలు
ఇక.. కర్ణాక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మద్దుతు ఇచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే.. కాంగ్రెస్ కు డబ్బులు అందజేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారని.. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది మోడీ అన్నారు. ఆలయాల సంపదను తీసుకుంటున్నారు, మైనార్టీ ప్రార్థనాస్థలాల జోలికి మాత్రం వెళ్లరని తెలిపారు. ఎంత జనాభా ఉంటే.. అంత హక్కు అని కాంగ్రెస్ అంటోందని.. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఒకటే సిద్ధాంతమని.. ఎన్నికలకు ముందు వాగ్ధానాలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం వాళ్ల పాలసీ అని తీవ్ర స్థాయిలో మోడీ విమర్శలు గుప్పించారు.