CPL 2025: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరోసారి విజేతగా నిలిచింది. దీనితో ఈ టోర్నమెంట్లో తమ జట్టు ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలోని నైట్ రైడర్స్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి కప్‌ను కైవసం చేసుకుంది.
Gautam Gambhir: ఆ ‘షేక్ హ్యాండ్’ ఏదో ఇచ్చేయండి.. వారి గోల ఉండదు.. కోచ్ గంభీర్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు చేపట్టిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులకే పరిమితమైంది. ఇక గయానా అమెజాన్ వారియర్స్ ఇన్నింగ్స్ లో ఇఫ్తికార్ అహ్మద్ (30), బెన్ మెక్‌డెర్మాట్ (28), డ్వైన్ ప్రిటోరియస్ (25) నిలకడగా రాణించారు. అయితే మిగితావారు పెద్దగా రాణించలేక పోవడంతో తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. ఇక నైట్ రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ మూడు వికెట్లు పడగొట్టగా, అకేల్ హోసిన్ రెండు వికెట్లు తీశాడు. అలాగే ఉస్మాన్ తారిఖ్, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ సాధించారు.
ఇక 131 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆరంభంలో ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (26), కొలిన్ మున్రో (23) మంచి శుభారంభం అందించారు. అయితే, ఆ తర్వాత గయానా బౌలర్లు వేగంగా వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. టోర్నీలో అద్భుతంగా రాణించిన కెప్టెన్ నికోలస్ పూరన్ కేవలం ఒక పరుగుకే వెనుదిరగడం నైట్ రైడర్స్‌ను ఆందోళనకు గురిచేసింది. కానీ, ఆ తర్వాత సునీల్ నరైన్ (22), కీరన్ పొలార్డ్ (21) కీలకమైన పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరకు అకేల్ హోసిన్ విన్నింగ్ షాట్ ఆడడంతో నైట్ రైడర్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ మూడు వికెట్లు తీయగా.. షమర్ జోసెఫ్, డ్వైన్ ప్రిటోరియస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కానీ వారి ప్రయత్నాలు జట్టును గెలిపించడానికి సరిపోలేదు. ఈ విజయంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ CPL చరిత్రలో ఐదోసారి టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
The Ultimate Champions! 🏆🇹🇹
TKR are on top once again! 🙌#CPL25 #CricketPlayedLouder #BiggestPartyInSport #GAWvTKR #CPLFinal25 pic.twitter.com/WuoJAvunPA
— CPL T20 (@CPL) September 22, 2025