Caste Conflict Case: కుల సంఘర్షణ కేసులో కర్ణాటకలోని కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పదేళ్ల క్రితం గంగావతి తాలూకా మారుకుంబి గ్రామంలో జరిగిన కుల సంఘర్షణ కేసులో 101 మంది దోషులకు గాను 98 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు నిందితులందరికీ రూ.5 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ కేసు కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా మారుకుంబిలో 28 అక్టోబర్ 2014న జరిగిన కుల ఘర్షణకు సంబంధించినది. ఈ మేరకు కొప్పల్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కుల సంఘర్షణ కేసులో 101 మందికి శిక్ష పడడం దేశంలోనే ఇదే తొలిసారి అని సమాచారం.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
101 మంది నిందితులపై అభియోగాలు కోర్టులో రుజువయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో షెడ్యూల్డ్ కులం, తెగకు చెందిన వారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులకు కుల దూషణ కేసు వర్తించదు. అందుకే 101 మందిలో ఈ ముగ్గురు దోషులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించబడింది. అయితే అల్లర్లకు పాల్పడినందుకు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Read Also: INDW vs NZW: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ ఘన విజయం!
2014లో కొప్పల్ జిల్లా మారుకుంబి గ్రామంలో దళితులను బార్బర్ షాపులు, హోటళ్లలోకి రానివ్వడం లేదంటూ కుల గొడవ జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తరువాత అక్కడ మరొక కేసు నమోదు చేయబడింది. మర్కుంబి పక్కనే ఉన్న గంగావతి గ్రామంలో కొందరు అగ్రవర్ణాల వారు సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ కొందరు దళిత యువకులు సినిమాను చూడడానికి వెళ్లగా గొడవ జరిగింది. ఈ కారణంగా మర్కుంబి గ్రామంలో దళితుల గుడిసెలకు అగ్రవర్ణాలు రాత్రి నిప్పు పెట్టారు. ఈ కేసులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు 101 మందిపై కేసు నమోదు చేశారు.