Imtiaz Ali: యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు.
వరుసగా హిట్లు కొట్టి, థియేటర్లలో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించే చిత్రనిర్మాతగా పేరుగాంచాడు. అతని తండ్రి మన్సూర్ అలీ కాంట్రాక్టర్, ఇరిగేషన్లో పనిచేశాడు. అతని మామ టీవీ నటుడు, దర్శకుడు ఖలీద్ అహ్మద్. ఇంతియాజ్ జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్‌స్టార్, హైవే, తమాషా, జబ్ హ్యారీ మెట్ సెజల్, అమర్ సింగ్ చంకీలా, లైలా మజ్ను వంటి అద్భుతమైన చిత్రాల సృష్టికర్త. జూన్ 16, 1971న జన్మించిన అతడు.. తన బాల్యాన్ని పాట్నాలో గడిపాడు. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు.
READ MORE: Bathukamma Festival: రేపటి నుంచి బతుకమ్మ సందడి.. అసలు బతుకమ్మ కథ ఏంటో తెలుసా!
తాజాగా ఇంతియాజ్ అలీ రణవీర్ అలహాబాద్ పాడ్‌కాస్ట్‌లో తాను చిన్నప్పుడు జరిగిన పలు సంఘటనలను పంచుకున్నాడు. తాను చిన్నప్పుడే ఋగ్వేదం, భగవద్గీతను చదివానని వెల్లడించాడు. భగవద్గీత తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పుస్తకం అని పేర్కొన్నాడు. ఆ పవిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ తన సైడ్ టేబుల్‌పై ఉంచుకుంటానని వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని కొన్నానని తెచ్చుకున్నట్లు వివరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు చదువినట్లు తెలిపాడు. అంతే కాదు.. ఇంతియాజ్ అలీ 1995లో “లైలా మజ్ను” నిర్మాత ప్రీతిని వివాహం చేసుకున్నాడు. ఆమె హిందువు. వారు వేర్వేరు మతాలకు చెందినవారైనప్పటికీ చాలా కాలం కలిసి జీవించారు. ఈ దంపతులకు ఇడా అలీ అనే కుమార్తె ఉంది. ఆమె రచయిత-దర్శకురాలు. అనేక షార్ట్ ఫిలిమ్‌లను నిర్మించింది. అయితే.. ఇంతియాజ్, ప్రీతి జంట 2012లో విడిపోయింది. కానీ.. ఇప్పటికీ కలుసుకుంటారని వార్తలు వస్తుంటాయి.