Site icon NTV Telugu

Heat wave warning: ఈ రాష్ట్రాలకు వేడిగాలుల ముప్పు.. వాతావరణశాఖ అలర్ట్

Heat

Heat

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులైతే వేడి తీవ్రతను తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. మరో వారం పాటు తీవ్ర వేడిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..

ఏప్రిల్ 17 నుంచి 21 వరకు గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఏప్రిల్ 17-18 తేదీల్లో గంగా పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 17-21 వరకు బీహార్, ఏప్రిల్ 19- 21 వరకు జార్ఖండ్, ఏప్రిల్ 17, 20 మరియు 21 తేదీల్లో ఒడిశాలో హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు సురక్షితంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Suresh Raina: ధోనీ నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

వేడి తరంగాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హార్ట్ పేషెంట్లు చల్లని, నీడ ప్రాంతాల్లో ఉండాలని తెలిపింది. సూర్యకాంతి పడకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..

భారత్‌లో ఎండలు ఇలా దంచికొడుతుంటే.. పశ్చిమాసియలో మాత్రం వరదలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి ఒమెన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అల్లాడిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. బుధవారం కూడా వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Exit mobile version