Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీకావాలని చూస్తున్నారు. 2026 తమిళనాడులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల తన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే “జన నాయకన్” చిత్రసీమకు గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా “జన నాయకన్” చిత్ర మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు.
Read Also:Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చిల్‌గా కనిపించిన విజయ్, సెకండ్ లుక్ పోస్టర్‌లో కూడా అదే కూల్ మూడ్‌లో కనిపిస్తూ, ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగించారు. ఒక ఫ్రేమ్‌లో కొరడా పట్టుకున్న విజయ్ చాలా సింపుల్‌గా కనిపించి, అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు విజయ్ కొత్త లుక్ చూసి తెగ ఉత్సాహంగా ఉన్నారు.
Read Also:Manchu Vishnu : త్రివిధ దళాల కుటుంబాల కోసం ముందడుగు వేసిన విష్ణు మంచు