ఈ రోజుల్లో అందరు బిజీబిజీ జీవితాలతో గడుపుతున్నారు. మనశాంతిగా తమ కుటుంబాలతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టెన్షన్ లైఫ్ లో ఆఫీసుకు వెళ్లడం, లేదంటే ఇంకేదైనా పనికి వెళ్లి రావడమే సరిపోతుంది. ఎక్కువ శాతం మనుషులు.. కూర్చొని చేసే జాబ్లను ఎంచుకుంటారు. దీంతో ఎప్పుడు కూర్చీకి అతుక్కునిపోయి ఉండటమే. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా.. కనీసం ఒక గంట కూర్చుంటే 5 నిమిషాలైనా లేచి నడువాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యం ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 70 సంవత్సరాల వయసు దాటినవారు ప్రతిరోజు నడవడంవల్ల గుండెపోటు ప్రమాదాలకు దూరంగా ఉంటారని తేలింది.
Konda Surekha: కొండా సురేఖకు రోడ్డు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టుకున్న కొండా మురళీ
వాకింగ్ ఆరోగ్యానికి మంచిది
ప్రతిరోజూ నడవడం చాలా మంచిది. ఎన్ని ఎక్కువ అడుగులు నడిస్తే అంత ఆరోగ్యమని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ 4500 అడుగులు నడిచేవారిలో వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందంటున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన ఒక అధ్యయనంలో.. అదనంగా 500 అడుగులు నడవడం వల్ల గుండె వ్యాధుల్లో 14 శాతం తగ్గింపు కనపడుతోంది. ప్రతిరోజు 500 అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది.
కనీసం అరగంట
ప్రతిరోజూ కనీసం ఒక అరగంట పాటు నడిస్తే.. బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నడకతో స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు నడవడం వల్ల రోజు మొత్తం చురుగ్గా ఉంటారు.
నిత్య యవ్వనం
రోజూ నడవడంవల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. మానసిక స్థితిని మెరుగుపరచడానికి, డిప్రెషన్ లక్షణాలను దూరం చేయడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నడకతో మనిషి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్, ఇతర డిమెన్షియాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు అరగంట తక్కువ కాకుండా నడుస్తుండాలి.