Flipkart: ప్రస్తుతం ప్రజలు సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఫోన్లకే పరిమితమై ఎదుటి వారితో మాట్లాడడానికి కూడా తీరిక లేకుండా మునిగిపోతున్నారు. దీంతో బయటప్రపంచానికి దూరం అవుతున్నారు. కనీసం ఇంట్లో కూరగాయలకు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా తెప్పించుకుంటున్నారు. దీంతో ఈ కామర్స్ సైట్ల బిజినెస్ బాగా పెరిగింది. రోజుకో కొత్త ఆఫర్ తో కొత్త సైట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో వాటి బిజినెస్ పెరిగిపోతూ కోట్లలో గడిస్తున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ కామర్స్ వెబ్‌సైట్లలోనూ అనేక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి కస్టమర్ చేతికి వస్తోంది.
Read Also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
తాజాగా ఈ కామర్స్ సర్వీస్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. అనంతపురం నగరంలోని పాతూరు భాగ్యనగర్‌కు చెందిన మస్తాన్‌వలి…. ఈ నెల 14న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34 వేలు విలువ చేసే ఐక్యూ ఫోన్ బుక్ చేశారు. ఈ నెల 17న ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిన బాక్సును డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు. బాక్సు బరువుగా ఉండడంతో బాధితుడికి సందేహం వచ్చింది… అప్రమత్తమై వీడియో తీస్తూ దానిని ఓపెన్ చేశాడు. ప్లిప్ కార్ట్ నుంచి వచ్చిన వస్తువును చూసి కంగుతిన్నాడు. ఫోన్ కు బదులు హెడ్ అండ్ షోల్డర్ షాంపు పెట్టి పంపించారు. వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. డెలివరీ చేసిన స్టోర్ మేనేజర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్టోర్ మేనేజర్‌ను ఆరా తీయగా రెండు మూడు రోజుల్లో బాధితుడికి డబ్బులు రీ ఫండ్ అవుతాయని తెలిపారు.