Ronald Ross: ఎన్నికల విధులకు హాజరు కాకుంటే కేసులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ronald Ross: ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులతో పాటు సిబ్బందికీ టెన్షన్ మొదలైంది. ఎన్నికల విధుల నిమిత్తం ఎంపిక చేసిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరవుతుండటంతో ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ,రొనాల్డ్ రోస్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 23 వేల మంది సిబ్బందిని శిక్షణకు ఎంపిక చేస్తే 3700 మంది హాజరుకాలేదని మండిపడ్డారు. అనారోగ్యం, గర్భిణులు మినహా మిగిలిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ మూడు పార్లమెంట్లలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయిన్నట్లు తెలిపారు.
Read Also: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
ఇక, ఈనెల 18 నుంచి 25వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు చెప్పారు రొనాల్డ్ రోస్. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని పత్రాలు జత పరచాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే కచ్చితంగా పత్రికల్లో ప్రచురించాలని సూచించారు. గతేడాది జిల్లాలో 45 శాతం మాత్రమే ఓటింగ్ అయిందన్నారు. ఈ సారి నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈ సారి మరో 10 శాతం పెంచెందుకు ఈ కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా ఓటేయాలన్నారు సూచించారు.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!