కొన్ని కొన్ని సార్లు కార్ల విషయంలో జరిగే అతి పెద్ద తప్పు పెట్రోల్ బదులు డిజీల్ కొట్టించడం, డిజీల్ బదులు పెట్రోల్ నింపడం. మనం తొందరలో ఉన్న లేదా ఆయిల్ బంక్ లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కార్లు వాడుతున్న వారున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న కార్లలో ఫ్యూయల్ నింపే ట్యాంకర్ వద్ద పెట్రోల్ లేదా డీజిల్ అనేది రాసి ఉంటుంది. అయినప్పటికి కొన్ని సందర్భాల్లో పెట్రోల్ ప్లేస్ లో డీజిల్ లేదా దాని స్ధానంలో ఇది నింపడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం వెంటనే జాగ్రత్త పడాలి లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరగొచ్చు.
పెట్రోల్ కారులో డీజిల్ నింపితే ఏమౌతుంది?
పెట్రోల్ కంటే డీజిల్ మందంగా అంటే సాంద్రత ఎక్కువ కలిగి ఉంటుంది. అందుకే అది పెట్రోల్ తో పోలిస్తే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. అలాగే డీజిల్ మండటానికి పెట్రోల్ తో పోలిస్తే ఎక్కువ సమయం పడుతుంది.పెట్రోల్ కంటే తక్కవ మండుతుంది డీజిల్. దీని వల్ల పొగ ఎక్కువగా వస్తుంది. ఇది ఇంజన్ సిలిండర్, పిస్టన్, షాఫ్ట్ దెబ్బతినేలా చేస్తుంది. ఇలా కనుక జరిగితే ఇంజన్ కు నష్టం జరిగి సీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా వాహనంలో ఇంజన్ గుండెలాంటిదని అందరికి తెలిసిందే. అందుకే ఇంజన్ కు నష్టం కలిగితే మొత్తం వాహనమే పనికి రాకుండా పోతుంది.
Also Read: kingfisher Beer : కింగ్ ఫిషర్ ప్రియులకు షాకింగ్ న్యూస్… ఆ బీర్ తాగితే ప్రమాదం
అనుకోకుండా పెట్రోల్ ప్లేస్ లో డిజీల్ కొట్టిస్తే ఏం చేయాలి?
అప్పుడప్పుడు అనుకోకుండా పెట్రోల్ కారులో డిజీల్ నింపుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో దానిని గుర్తించిన వెంటనే మీరు వాహనాన్ని నడపడం ఆపేయాలి. మీరు వాహనం స్టార్ చేసినా కూడా మీకు తేడా వెంటనే అర్థం అయిపోతుంది. స్టాట్ కావడంలో ప్రాబ్లమ్ వస్తుంది. ఇలా గుర్తిస్తే వెంటనే వాహనం ఇంజన్ ఆపేయాలి. ట్యాంకర్ నుంచి ఇంజన్ లోకి డీజిల్ వెళ్లకుండా మెకానిక్ సాయంతో కనెక్టింగ్ పైపును తీసివేయాలి. అంతేకాకుండా డిజీల్ మొత్తాన్ని తొలగించాలి. ఎక్కడైనా డీజిల్ మిగిలిపోతే దానిని శుభ్రంగా తొలగించాలి. తరువాత రెండు మూడు లీటర్ల పెట్రోల్ కొట్టించి నెమ్మదిగా స్టార్ చేసి ఆపుతూ ఉండాలి. దీని ద్వారా ఇంజన్ కు వెళ్లే పైప్స్ లో ఉన్న డీజిల్ కూడా వచ్చేస్తుంది. తరువాత వెంటనే కంపెనీ ఎక్స్ పర్ట్స్ తో వాహనాన్ని చెక్ చేయించాలి. ఇలా కాకుండా డిజీల్ తోనే కారును నడిపే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది గుర్తుంచుకోండి.