టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ వెడ్డింగ్‌కు ముహూర్తం దగ్గరపడింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో రెండు రోజుల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతుండటంతో, అక్కడి ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్ పెళ్లి కళతో కళకళలాడుతోంది. ఇప్పటికే రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు వేదిక వద్దకు చేరుకోగా.. సోషల్ మీడియాలో విజయ్, రష్మిక పంచుకున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా
Also Read : Mrunal Thakur: వారి కారణంగా నేను ఎడవని రాత్రి లేదు..
విజయ్ దేవరకొండ తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న ఫోటోను షేర్ చేయగా.. రష్మిక డైనింగ్ టేబుల్‌పై గ్రీన్ థీమ్‌తో ఉన్న డిన్నర్ మెనూ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఆ మెనూ కార్డుపై ‘విరోష్’ (ViRosh) అని రాసి ఉండటం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, నేటి నుంచే వీరి వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు (ఫిబ్రవరి 24) సంగీత్, మెహందీ వేడుకలు జరగనుండగా, రేపు హల్దీ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అత్యంత గోప్యంగా, ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వివాహాన్ని నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హోటల్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా స్పెషల్‌గా ఉండేలా ఈ జంట ప్లాన్ చేసుకుంది. మెనూ కార్డుపై ‘విరోష్’ అనే పేరుతోనే తమ కొత్త ప్రయాణానికి పునాది వేస్తున్నారు. ఈ పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.