kingfisher Beer : కింగ్ ఫిషర్ ప్రియులకు షాకింగ్ న్యూస్… ఆ బీర్ తాగితే ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఫిషర్ బీర్ తాగే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించేటప్పుడు కానీ, పార్టీ చేసుకునేటప్పుడు కానీ మీ ఛాయిస్ కింగ్ ఫిషర్ బీర్ అయితే ఈ వార్త మీకు కొంచెం భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) గుర్తించారు అధికారులు. అవి మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.
కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కెమికల్ పరీక్షల్లో తేలింది. జూలై 17,2023న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నంజన్‌గడ్ యూనిట్‌లో తయారు చేయబడిన బీర్లలలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నంజన్‌గడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జూలై 28న ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని కెమికల్ టెస్ట్ కోసం పంపారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్టు వచ్చే వరకు స్టాక్ ను సీజ్ చేయాలని ఆదేశించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే దీనికి సంబంధించిన రిపోర్టు ఆగస్ట్ 2 న వచ్చింది. ఆ బీర్లలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లు ఉపయోగానికి పనికి రావని, వాటిని తాగితే ప్రమాదమని పరీక్షల్లో తేలింది. దీంతో రసాయన పరీక్ష నివేదికలో విఫలమైన స్టాక్‌ను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. అక్కడ తయారైన రూ.25 కోట్ల విలువైన 78వేల 678 బీరు బాక్సులను సీజ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.
Also Read: Chaiwala: చిన్న టేబుల్ పై ఛాయ్ షాప్… కానీ అక్కడ రాసున్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే
అయితే మొత్తం 78వేల 678 బాక్సులను ఉత్పత్తి చేయగా వాటిలో 45వేల 500 వరకు ఇప్పటికే సరఫరా చేశారు. బెంగళూరులోనే దాదాపు 11వేల సీసాలు సప్లయ్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కింగ్ ఫిషర్ బీర్ ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు వీటిని తయారుచేసిన యునైటెడ్ బ్రూవరీస్ పై కేసు నమోదు చేశారు. ఈ బీరులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తెలియడంతో వీటిని తాగాలంటేనే మద్యం ప్రియులు భయానికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!